నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 07:34

నేడు సూర్యగ్రహణం.. నాలుగు రాశుల వారు ఈ విషయాల్లో జాగ్రత్త

నేడు సూర్యగ్రహణం. ఈ ఏడాది ఏప్రిల్ 20 గురువారం అమావాస్య రోజున సూర్యగ్రహణ ఏర్పడనుంది. ఉదయం 7.05 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.29 గంటలకు ముగుస్తుంది.

అంటే దాదాపు 5 గంటల 25 నిమిషాల పాటు ఉంటుంది. అయితే ఇది భారత్‌లో కనిపించదు.

ఇక ఈ సూర్యగ్రహణం రోజు కొన్నిగ్రహాల కలయిక జరుగుతుంది. అందువలన నాలుగు రాశులవారు జాగ్రత్తగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు. ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, ఈ సూర్యగ్రహణం ఏ రాశులపైన ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి :

మేష రాశివారు సూర్యగ్రహణం రోజు శుభకార్యాలు చేయడం, కొత్త పనులు ప్రారంభించడం, కొత్త వస్తువులు కొనడం అస్సలే మంచిది కాదంట. గ్రహణం ప్రభావంతో ఈ రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది.

వృశ్చిక రాశి :

ఈ రాశి వారిపై సూర్యగ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది. దీని వలన వీరు ఆర్థిక సమస్యలు, ఖర్చులు అధికం కానున్నాయంట. అంతే కాకుండా చిన్న చిన్న గొడవలు జరుగుతాయంట. అందువలన ప్రతీ విషయంలో ఆచీ తూచీ అడుగు వేయాలంటున్నారు పండితులు. ఇక వీరు శివనామస్మరణ చేయడం చాలా మంచిదంట.

కన్యరాశి:

ఈ రాశి వారు సూర్యగ్రహణం రోజు కొత్త పనులు ప్రారంభించకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా నడపాలి. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.

మకర రాశి :

ఈరాశి వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే ఆర్ధిక సమస్యలు, ఖర్చులు అధికం కానున్నాయి. చేయాలనుకున్న పనులు అలాగే నిలిచిపోతాయి. ఇక గ్రహణం ఉన్నందున కొత్త పనులేవీ ప్రారంభించకూడదు.

నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 07:31

నేటితో పూర్తికానున్న ఇంటర్‌ వాల్యుయేషన్‌

గత పది రోజుల క్రితం ప్రారంభమైన ఇంటర్‌ పేపర్‌ వాల్యుయేషన్‌ ప్రక్రియ నేటితో పూర్తికానుంది. ఇంటర్‌ పరీక్షలు మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్‌ 3 వరకు జరిగాయి.

పది పరీక్షలు ఏప్రిల్‌ ఆరున ప్రారంభమై నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఇంటర్‌ పేపర్‌ వాల్యుయేషన్‌ పదవ తేదీ నుంచి ప్రారంభమైంది. తిరుత్తణిలోని గెంగుస్వామి నాయుడు మెట్రిక్‌ పాఠశాల, తిరువళ్లూరులోని డీఆర్‌బీసీసీ, ఆవడిలోని ఎయిడెడ్‌ పాఠశాల మూడు కేంద్రాల్లో జరిగింది. మొత్తం ఆరు వందల మంది ఉపాద్యాయులు వాల్యుయేషన్‌లో పాల్గొన్నారు.

ఇంటర్‌ వాల్యుయేషన్‌ నేటితో ముగియనుండడంతో శుక్రవారం నుంచి విద్యార్థుల మార్కులను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు.

ఇలావుండగా పది పరీక్షలు నేటితో ముగియనున్న నేపథ్యంలో 24 నుంచి వాల్యుయేషన్‌ ప్రారంభం కానుంది. ఇందుకోసం తిరుత్తణి, తిరువళ్లూరు, ఆవడిలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాల్యుయేషన్‌ ప్రక్రియ 15 రోజుల పాటు సాగే అవకాశం వుంది.

నిజంనిప్పులాంటిది

Apr 19 2023, 19:14

Andhra News: ఏపీ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణకు మరోసారి నోటీసులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది..

సూర్యనారాయణ అధ్యక్షుడిగా ఉన్న ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.

గతంలో వాణిజ్య పన్నుల శాఖలోని ఉద్యోగుల బదిలీలకు సంబంధించి అదనపు కమిషనర్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

కార్యాలయం వెలుపల ఉన్నతాధికారిని దిగ్భందించి ఆందోళన చేయడంపై సంజాయిషీ ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం మరోమారు నోటీసులు జారీ చేస్తూ.. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది..

నిజంనిప్పులాంటిది

Apr 19 2023, 19:12

Population: భారత్‌ జనాభా 142.86కోట్లు.. చైనాను అధిగమించి తొలిస్థానంలోకి..!

దిల్లీ: ప్రపంచంలో అత్యధిక జనాభా (Population) కలిగిన దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. చైనా కంటే 29లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది..

ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐరాస (United Nations) బుధవారం విడుదల చేసింది. 1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్‌ తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచింది.

జనాభా అంచనాలకు సంబంధించి 'స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్టు-2023' పేరుతో యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్స్‌ (UNFPA) తాజా నివేదికను విడుదల చేసింది. భారత్‌లో అత్యధికంగా 142.86 కోట్ల జనాభా ఉన్నట్లు లెక్కకట్టింది.

మనతో పోలిస్తే చైనాలో 29 లక్షల మంది తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.57కోట్లుగా అంచనా వేసింది. ఇక ప్రపంచంలో మూడోస్థానంలో ఉన్న అమెరికాలో 34కోట్ల మంది ఉన్నట్లు అంచనా వేసింది. ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించినట్లు తెలిపింది..

నిజంనిప్పులాంటిది

Apr 19 2023, 19:10

Mysore Fire Accident: మైసూరులో భారీ అగ్నిప్రమాదం.. ఏకంగా రెండు కీలోమీటర్ల మేర..

A Fire Broke Out In A Firecracker Factory In Hubli Industrial Park: మైసూరులో ఒక భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక బాణా సంచా దుకాణంలో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించడంతో..

రెండు కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో.. స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవ్వడంతో పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మైసూరులోని హుబ్లీ ఇండస్ట్రీయల్‌ పార్క్‌లో ఒక ప్రైవేటు గోడౌన్ ఉంది.

అందులో క్రాకరీ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. ఆ ఫ్యాక్టరీలో ఉన్నట్లుండి మంటలు చెలరేగడంతో.. అందరూ బతుకుజీవుడా అంటూ పరుగులు పెట్టారు. అది క్రాకరీ ఫ్యాక్టరీ కావడంతో.. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి.

బాణాసంచాలన్ని పేలడంతో.. మంటలు మరింత చెలరేగాయి. దీని ధాటికి.. చుట్టుపక్కల ఉన్న 50కి పైగా భవనాలు దెబ్బతిన్నాయి. ఈ పేలుడు ధాటికి రెండు కీలోమీటర్ల దూరం వరకు ప్రభావితం అయినట్లు తెలిసింది.

నిజంనిప్పులాంటిది

Apr 19 2023, 17:44

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీనివాసరావు గురూజీ

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ శ్రీనివాసరావు గురూజీ గారు. నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు గారి ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న హ్యాపీనెస్, సుదర్శన క్రియ, యోగ, మెడిటేషన్ కార్యక్రమాలు.

ఈరోజు పెద్దకాపర్తి గ్రామంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ సుదర్శన క్రియ ప్రోగ్రాం ల ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ శ్రీనివాసరావు గురూజీ గారిచే సుదర్శన్ క్రియ యోగ మెడిటేషన్ కార్యక్రమాలు గత నాలుగు రోజులుగా పెద్దకాపర్తి గ్రామంలో నిర్వహించడం జరిగింది.

శ్రీనివాస్ రావు గురూజీ మాట్లాడుతూ జీవితం ఆనందదాయకంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు సుదర్శన క్రియ ప్రతినిత్యం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో మార్పు రావాలంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా హ్యాపీనెస్ సుదర్శన క్రియ సాధనను నేర్చుకోవాలన్నారు. ప్రపంచంలోనే అతి గొప్ప శ్వాస ప్రక్రియ సుదర్శన క్రియ అని కొనియాడారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ ఒత్తిడిని పారదోలి ఆచరణాత్మక చర్యలకు వీలు కల్పిస్తూ మన ఆరోగ్యాన్ని మరియు జీవశక్తిని పెంపొందిస్తుంది అన్నారు, ధ్యానం మరియు ఉఛ్వాస నీశ్వాసలను చక్కగా పొందుతారని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి ఆనందం, ఆరోగ్యం కావాలంటే తప్పనిసరిగా సుదర్శన్ క్రియ చేయాలని దీని ద్వారా మన మనసు మన ఆధీనంలో ఉంటూ మన శ్వాస ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోగలమని తెలియజేశారు. శ్వాసను పట్టుకో ఆరోగ్యాన్ని పెంచుకో జీవితం ఆనందదాయకంగా ఉంటుందన్నారు.

సుదర్శన క్రియ ద్వారా శారీరక మరియు మానసిక బలహీనత నుండి విముక్తి పొందుతారని, వ్యక్తిగత సంబంధాలను పెంపొందించుకుంటారని, రక్త పోటు, మధు మొహం, ఉబ్బసం మొదలగు రోగాలను అరికట్టవచ్చని, గుండె జబ్బులు, పక్షపాతం, మైగ్రేన్, సైనసైటిస్, చర్మవ్యాధులు గ్యాస్టిక్ సమస్యలు మరియు ఎన్నో ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారు ప్రపంచవ్యాప్తంగా 186 దేశాల లోని అన్ని వర్గాలవారికి 45 మిలియన్ ప్రజలకు దీని ద్వారా గొప్ప ప్రయోజనాలను పొందారన్నారు. ప్రతి ఒక్కరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా హ్యాపీనెస్ కోర్స్ చేసి ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందారు.మనసుకు శరీరానికి మధ్యలో శ్వాస ఉంటుంది ఆ శ్వాసను పట్టుకుంటే ఆనందం ఆరోగ్యం మీ సొంతమవుతుంది అని గురూజీ అన్నారు.

ఈ హ్యాపీనేస్ కోర్సు ద్వారా మీ జీవితంలో కొత్త మార్పు మొదలవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యోగా టీచర్ కిషోర్, పొట్లపల్లి నరసింహ, నీలకంఠం నరేష్, మైల సత్తయ్య, నారాయణ రమేష్, జీ. నాగచారి,చంద్రయ్య, మోర ధనుంజయ్, గుండెబోయిన నరసింహ, మర్రి హరీష్ రెడ్డి, రాచమల్ల జానయ్య, లడే రాములు, ఆవుల జానయ్య వెంకటేష్, సిద్ధ గాని అశోక్, పామనగుండ్ల వెంకన్న, పాకాల దినేష్, బెలిజ సత్యనారాయణ, ఉయ్యాల లింగస్వామి, రాచమల్ల శ్రీనివాస్, మాధగొని లింగస్వామి, పాకాల సత్యనారాయణ, సిలువేరు వెంకటేష్, శిలువేరు శివయ్య తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 19 2023, 17:37

BREAKING : టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు..పుష్ప షూటింగ్ రద్దు !

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కు ఊహించని షాక్‌ తగిలింది..

ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లో తాజాగా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు..

జీఎస్టీ సరిగా కట్టలేదనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే..

సుకుమార్ ఇంట్లో తాజాగా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని సమాచరం..

నిజంనిప్పులాంటిది

Apr 18 2023, 21:48

తెలంగాణలో మరో కొత్త పార్టీ ... "తెలంగాణ నిర్మాణ పార్టీ"

చర్లపల్లి జైలు ముందే పార్టీ పేరు ప్రకటించిన తీన్మార్ మల్లన్న.

చర్లపల్లి జైలు నుంచి విడుదలైన క్యు న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న తాను కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

కేసులు సెక్షన్ గా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

వీకర్ సెక్షన్ గా తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తున్నారన్నారు వచ్చే నాలుగు నెలల్లో తెలంగాణలో కేసీఆర్ పేరు వినీపించకోకుండా చేస్తామన్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 18 2023, 17:33

Viveka Case Update: అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట..

హైదరాబాద్‌: వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనల తర్వాత..

మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లో ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్‌ చేయొద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

నిజంనిప్పులాంటిది

Apr 18 2023, 17:10

డీజీపీతో సీఎం జగన్ కీలక భేటీ..

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు..

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో వివేకా హత్య కేసు పరిణామాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది..

ఈ కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సమీక్షలో చర్చ జరిగినట్లు సమాచారం..